టెండర్లన్నీ దక్కించుకున్న ఆ ముగ్గురు ఎవరు?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-09-14T17:47:50+05:30 IST
ఎన్‌డీబీ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం- అభివృద్ధికి సంబంధించి రెండు ప్రాజెక్టులో భాగంగా
అమరావతి: ఎన్‌డీబీ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం- అభివృద్ధికి సంబంధించి రెండు ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో రహదారి పనుల కోసం పిలిచిన టెండర్లను ఎవరకి కట్టబెట్టాలో ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘సీమలో ఎన్‌డీబీ పనుల పందేరం, సొంత పార్టీ నేతలకే 793 కోట్ల పనులు, పోటీ టెండర్లు సొంతవారివే, ఏ టెండర్ ఎవరికి కట్టబెట్టాలో ముందే నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు, ముందుగా తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారమే టెండర్లు దాఖలు. రిజర్వు టెండరింగ్‌లో టెండర్లన్ని దక్కించుకున్న ఆ ముగ్గురు ఎవరు? చెప్పండి సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.