272వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు
ABN , First Publish Date - 2020-09-14T13:23:01+05:30 IST
మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 272వ రోజుకు చేరుకున్నాయి.
అమరావతి: మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 272వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దొండపాడు గ్రామంలో నూతన దీక్షా శిబిరాన్ని రైతులు, రైతు కూలీలు నేటి నుండి ప్రారంభించనున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.