అమరావతి: తీవ్ర నిరాశలో రాజధాని రైతులు
ABN , First Publish Date - 2020-08-01T18:52:46+05:30 IST
అమరావతి: తీవ్ర నిరాశలో రాజధాని రైతులు

అమరావతి: రాజధాని రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందనే ఆవేదనలో ఉన్నారు. ఆంధ్రుల రాజధాని కోసం తమ భూములను త్యాగం చేయడం తాము చేసిన తప్పిదమని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ చెప్పులతో తమను కొట్టుకుంటున్నారు. రాజధాని గ్రామాల్లో భూములు ఇచ్చిన ప్రతీ ఇంట విషాద వాతావరణం నెలకొంది. ఒకప్పుడు అమరావతికి అంగీకరించిన జగన్ ఎన్నికల సమయంలోనూ తాను అమరావతిలోనే ఇళ్లు కట్టుకున్నానని...రాజధాని మార్చబోమని చెప్పి...ఇప్పుడు తమను నిలువునా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రైతులు భూములిచ్చారు. అందుకోసం వారేమీ తీసుకోలేదు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన తర్వాత తిరిగి ఇచ్చే భూమికి మంచి విలువ వస్తుందని ఆశపడ్డారు. అయితే ఇప్పుడు రైతులను ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులన్నింటినీ ఆపేసి మెల్లగా రాజధాని తరలించే పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులకు కౌలు కూడా చెల్లించలేదు. రాజధాని రైతుల ఆవేదను పై వీడియోలో వీక్షించండి.