అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-07-27T20:48:27+05:30 IST

గుంటూరు: అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

గుంటూరు: అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తమకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడంపై అమర్‌రాజా సంస్థ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. గతంలో చిత్తూరులో అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు 483 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కేటాయించిన 483 ఎకరాల్లో వైసీపీ ప్రభుత్వం 253 ఎకరాలు వెనక్కి తీసుకుంది. భూములను వెనక్కితీసుకోవడంపై అమర్‌రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

Updated Date - 2020-07-27T20:48:27+05:30 IST