-
-
Home » Andhra Pradesh » amanchi krishna mohan balineni srinivasa reddy jagan
-
హార్డ్ కోర్ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు: ఆమంచి
ABN , First Publish Date - 2020-03-13T22:59:47+05:30 IST
హార్డ్ కోర్ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. ఏడాదిలోగా టీడీపీ క్లోజ్ అవుతోందని, అందుకే వాళ్లంతా వైసీపీలోకి వస్తున్నారని జోస్యం చెప్పారు.

అమరావతి: హార్డ్ కోర్ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. ఏడాదిలోగా టీడీపీ క్లోజ్ అవుతోందని, అందుకే వాళ్లంతా వైసీపీలోకి వస్తున్నారని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ కలిశారు. టీడీపీ నేతలు చంద్రబాబు మీద విరక్తి చెంది ఉన్నారని, చాలా మంది టచ్‌లో ఉన్నారని, సెలక్టీవ్‌గా చేర్చుకుంటున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చీరాల వైసీపీలో మార్పులు చేర్పులు ఉండవని జగన్ చెప్పారని, నాడు టీడీపీలో చేరికలకు.. ఇప్పుడు వైసీపీలో చేరికలకు వ్యత్యాసం ఉందని ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు.