బీజేపీ నేతల గృహనిర్బంధం

ABN , First Publish Date - 2020-09-18T08:40:06+05:30 IST

‘చలో అమలాపురం’ పేరుతో అంతర్వేదికి బయలుదేరిన బీజేపీ, అనుబంధ మోర్చా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై

బీజేపీ నేతల గృహనిర్బంధం

‘చలో అమలాపురం’ నిరసనకు పోలీసుల బ్రేక్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

‘చలో అమలాపురం’ పేరుతో అంతర్వేదికి బయలుదేరిన బీజేపీ, అనుబంధ మోర్చా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బీజేపీ నిరసనకు దిగింది. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని ప్రాంతాల నేతలు ఈ కార్యక్రమానికి తరలి రావాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. శుక్రవారం అక్కడికి చేరుకోవడానికి గురువారం సాయంత్రమే ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర నుంచి పార్టీ నేతలు వాహనాల్లో బయలు దేరారు. అయితే అన్ని ప్రాంతాల నాయకులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అడ్డుకున్న పోలీసులు... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పి.విష్ణుకుమార్‌రాజును విశాఖపట్నంలో పోలీసులు గురువారం హౌస్‌ అరెస్టు చేశారు. అమలాపురం ప్రాంతంలో పోలీస్‌ యాక్ట్‌ 30తోపాటు 144సెక్షన్‌ అమల్లో ఉందని డీజీపీ కార్యాలయం తెలిపింది. 

Updated Date - 2020-09-18T08:40:06+05:30 IST