-
-
Home » Andhra Pradesh » alla nani coronavirus
-
ఏపీకి విదేశాల నుంచి 13,301 మంది వచ్చారు: ఆళ్ల నాని
ABN , First Publish Date - 2020-03-23T21:13:57+05:30 IST
ఏపీకి విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 2,228 మందికి 28 రోజుల క్వారంటైన్ ముగిసిందన్నారు. హోం క్వారంటైన్‌లో 11 వేల 26 మంది..

అమరావతి: ఏపీకి విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 2,228 మందికి 28 రోజుల క్వారంటైన్ ముగిసిందన్నారు. హోం క్వారంటైన్‌లో 11 వేల 26 మంది..53 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఏపీలో 6కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 22మంది రిపోర్ట్స్ రావాల్సిందేనని పేర్కొన్నారు. మొదటి దశలో విద్యాసంస్థలు, రెండో దశలో ప్రజా రవాణా బంద్ చేశామన్నారు. నిత్యావసర వస్తువులు, వైద్యం, ఇతర అత్యవసర సేవలకు మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి నుంచి ప్రతిదీ చాలా కీలకమని, ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామం తీసుకుంటున్నామని ఆళ్ల నాని చెప్పారు.