ఫైళ్లన్నీ మా ద్వారానే వెళ్లాలి

ABN , First Publish Date - 2020-10-03T07:55:43+05:30 IST

‘‘సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, విజయనగరం మాన్సాస్‌ ట్రస్టులో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినా సంబంధిత ఫైళ్లు మా ద్వారానే వెళ్లాలి’’

ఫైళ్లన్నీ మా ద్వారానే వెళ్లాలి

 సింహాచలం, మాన్సా్‌సకు 

దేవదాయ శాఖ ఉత్తర్వులు


విజయనగరం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, విజయనగరం మాన్సాస్‌ ట్రస్టులో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినా సంబంధిత ఫైళ్లు మా ద్వారానే వెళ్లాలి’’ అని దే వదాయ శాఖ  ప్రత్యేక కమిషనర్‌ పి.అర్జునరావు ఆదేశించారు. ఆమేరకు ఉత్తర్వులు శుక్రవారం ఆయా శాఖలకు చేరినట్లు సమాచారం.


ఫైళ్లు అమరావతిలోని కమిషనరేట్‌ కార్యాలయంలోని ఏ, బీ, ఎల్‌ సెక్షన్ల పరిధిలోని సీవీ పుష్పవర్ధన్‌, చంద్రశేఖర్‌ అజాద్‌లకు పంపించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇటీవల సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ కార్యకలాపాలపై ప్రజలలో తలెత్తుతున్న అనేక అనుమానాల నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-10-03T07:55:43+05:30 IST