-
-
Home » Andhra Pradesh » all party meet at bengal on covid
-
కరోనాపై బెంగాల్‌లో అఖిలపక్ష భేటీ
ABN , First Publish Date - 2020-06-23T00:45:45+05:30 IST
రాష్ట్రంలో కరోనా నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా : రాష్ట్రంలో కరోనా నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ‘‘కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత పరిస్థితులు... తదితర అంశాలపై ఓ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించమని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే వివిధ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోడానికే ఈ సమావేశం’’ అని ఓ సీనియర్ మంత్రి తెలిపారు.