-
-
Home » Andhra Pradesh » All 31 of them will be sent home after 14 days if negative Avanti
-
ఆ 31 మందినీ 14 రోజుల తర్వాత నెగిటివ్ వస్తే ఇళ్లకు పంపుతాం: అవంతి
ABN , First Publish Date - 2020-03-23T20:00:28+05:30 IST
విమ్స్ ఆస్పత్రుల్లో వివిధ దేశాలకు చెందిన 31 మంది ఉన్నారని.. వారిని 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

విశాఖ: విమ్స్ ఆస్పత్రుల్లో వివిధ దేశాలకు చెందిన 31 మంది ఉన్నారని.. వారిని 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. కరోనాపై ప్రజలు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్చందంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విమ్స్ ఆస్పత్రిని ఐసోలేషన్‌కు వాడుకోవచ్చని మంత్రి అవంతి తెలిపారు. గాలి ద్వారా కరోనా రాదని.. కేవలం టచ్ ద్వారానే వస్తుందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దన్నారు. హోం క్వారంటైన్‌లో 961 మంది మాత్రమే ఉన్నారన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. వినకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి అవంతి హెచ్చరించారు.