ఏపీలో అరాచకపాలన సాగుతోంది: ఆలపాటి

ABN , First Publish Date - 2020-03-21T22:42:20+05:30 IST

ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. ఏపీలో ఉండాలంటే ఎన్నికల కమిషనర్

ఏపీలో అరాచకపాలన సాగుతోంది: ఆలపాటి

అమరావతి: ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. ఏపీలో ఉండాలంటే ఎన్నికల కమిషనర్ భయపడుతున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఎవరికీ భద్రత లేదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి కులం అంటగడతారా?,  వైసీపీ నేతల తీరు కరోనా కంటే భయంకరంగా ఉందని మండిపడ్డారు. సుప్రీం తీర్పును కూడా వైసీపీ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. వ్యవస్థల మీద వైసీపీకి నమ్మకం లేదన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 


ఏపీలో హెల్త్ మినిస్టరీ ఉందా?, ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు శూన్యమని చెప్పారు. ప్రజల ప్రాణాలకంటే వైసీపీకి స్థానిక ఎన్నికలే ముఖ్యమన్నారు. ఏపీలో కరోనానే లేదన్నట్టుగా మంత్రి బుగ్గన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి కరోనాపై కనీస అవగాహన లేదని ఆలపాటి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-03-21T22:42:20+05:30 IST