ఆకాశవాణి విశ్రాంత న్యూస్‌ రీడర్‌ దుగ్గిరాల పూర్ణయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2020-03-30T07:45:31+05:30 IST

ఆకాశవాణి విశ్రాంత తెలుగు న్యూస్‌ రీడర్‌ దుగ్గిరాల పూర్ణయ్య (83) ఆదివారం కన్నుమూశారు. కొన్ని దశాబ్దాల పాటు నిత్యం ఆయన గొంతు వింటూ ప్రజలు దైనందిన...

ఆకాశవాణి విశ్రాంత న్యూస్‌ రీడర్‌ దుగ్గిరాల పూర్ణయ్య కన్నుమూత

గుడ్లవల్లేరు, మార్చి 29: ఆకాశవాణి విశ్రాంత తెలుగు న్యూస్‌ రీడర్‌ దుగ్గిరాల పూర్ణయ్య (83) ఆదివారం కన్నుమూశారు. కొన్ని దశాబ్దాల పాటు నిత్యం ఆయన గొంతు వింటూ ప్రజలు దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు. వార్తలు చదువుతోంది దుగ్గిరాల పూర్ణయ్య అని ఆయన కంచు కంఠంతో రేడియోలో వార్తలు చదువుతుంటే, ఆయన చదివే వార్తల కోసం రేడియోల ముందు కూర్చొనే శ్రోతలు ఎక్కువమంది ఉండేవారు.  మాజీ ప్రధాని వాజ్‌పేయితో ఆయనకు మంచి సహచర్యం ఉంది. ఉద్యోగ విరమణ తరువాత తన శేష జీవితాన్ని స్వస్థ్థలం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో గడపాలని నిర్ణయించుకుని ఇక్కడకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం పూర్ణయ్య అంత్యక్రియలు జరిగాయి.

Updated Date - 2020-03-30T07:45:31+05:30 IST