మీటర్లతో రైతులు ఆత్మహత్యే: ఏఐటీయూసీ

ABN , First Publish Date - 2020-09-05T09:22:05+05:30 IST

రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత ..

మీటర్లతో రైతులు ఆత్మహత్యే:  ఏఐటీయూసీ

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి):రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు-2020 పార్లమెంట్‌ ఆమోదం పొందకముందే, అందులోని ప్రధాన షరతులైన.. పంపుసెట్లకు మీటర్ల బిగింపు, రైతులు వాడిన కరెంట్‌కు బిల్లు వసూలు తదితర అంశాల అమలుకు ప్రభుత్వం పూనుకోవడం సరికాదన్నారు.

Updated Date - 2020-09-05T09:22:05+05:30 IST