సాగు అనుబంధ రంగాలకు మినహాయింపులు

ABN , First Publish Date - 2020-04-08T09:08:03+05:30 IST

లాక్‌డౌన్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది.

సాగు అనుబంధ రంగాలకు మినహాయింపులు

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. లాక్‌డౌన్‌ కాలంలో శాఖల వారీగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల సేకరణ ఏజెన్సీలకు, మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించే మండీలకు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ పశువైద్యశాఖలు, పశువుల మందులకు మినహాయింపు ఉందని తెలిపారు. అలాగే వ్యవసాయం, ఉద్యాన పంట ఉత్పత్తుల రవాణాకు అనుమతించారు.  

Updated Date - 2020-04-08T09:08:03+05:30 IST