ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

ABN , First Publish Date - 2020-05-24T18:41:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. వారంలో రెండు మూడ్రోజులు కేసులు తగ్గితే మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి...

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. వారంలో రెండు మూడ్రోజులు కేసులు తగ్గితే మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నెల మొదటి రెండు వారాల పాటు చాలా తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు మళ్లీ పెరిగిపోయాయి. ఆదివారం నాడు కేసులు భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో 66 కేసులు నమోదయినట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2627కు చేరుకుంది. కొత్తగా నమోదైన ఈ కేసుల్లో దుబాయ్-03, కువైట్-12, కత్తర్-02 నుంచి వచ్చిన 17 మంది ఉన్నారు. చిత్తూరు-03, నెల్లూరు-08 కేసులు నమోదవ్వగా ఈ 11 కేసులూ కోయంబేడు కాంటాక్ట్స్‌‌.


డిశ్చార్జ్, మరణాల లెక్కలివీ..

శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకూ 11,357 శాంపిల్స్‌ని పరీక్షించగా 66 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 29 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2627 పాజిటివ్ కేసులకు గాను 1807 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ మొత్తం 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764.Updated Date - 2020-05-24T18:41:27+05:30 IST