ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయ్.. 24 గంటల్లో కొత్తగా..

ABN , First Publish Date - 2020-05-18T16:55:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో గతవారం రోజులుగా కరోనా ఉధృతి తగ్గినట్లే అనిపించిన గత

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయ్.. 24 గంటల్లో కొత్తగా..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గతవారం రోజులుగా కరోనా ఉధృతి తగ్గినట్లే అనిపించిన గత 24 గంటలుగా ఒక్కసారిగా కేసులు ఎక్కువయ్యాయి. ఆదివారం నాడు 25 కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటలుగా ఆ కేసులకు డబుల్ అయ్యాయి. కొత్తగా 52 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,282కి చేరింది. ఈ 52 కేసుల్లో చిత్తూరు-15, తూర్పుగోదావరి-05, కడప 2, కృష్ణా- 15, కర్నూలు-04, నెల్లూరు-07, విశాఖ, విజయనగరంలో ఒక్కో కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 


డిశ్చార్జ్, మరణాల లెక్కలివీ..

కాగా.. రాష్ట్రంలో గత 24 గంటల్లో (ఆదివారం 9గంటల నుంచి సోమవారం 9 గంటలవరకు) 9,713 శాంపిల్స్‌ను పరీక్షించగా 52 మంది పాజిటివ్‌గా నిర్దారింపబడింది. కొత్తగా 94 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. వీరిలో గుంటూరు-40, కర్నూలు- 28, కృష్ణ-10, చిత్తూరు-05, తూర్పుగోదావరి-04, విశాఖపట్నం-04, అనంతపురం-02, కడప- ఒక్కరు డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2282 పాజిటివ్ కేసులకుగాను 1527 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఇప్పటి వరకూ 50 మంది మరణించారు. గత రెండ్రోజులుగా ఏపీలో కరోనా మరణాలేమీ సంభవించలేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 705గా ఉంది.


జిల్లాల వారీగా కేసులు లెక్కలు చూస్తే..



Updated Date - 2020-05-18T16:55:45+05:30 IST