టీటీడీ శిల్ప కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
ABN , First Publish Date - 2020-09-14T08:07:10+05:30 IST
తిరుపతిలోని శిల్ప కళాశాలలో అడ్మిషన్లకు టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంప్రదాయ
తిరుపతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శిల్ప కళాశాలలో అడ్మిషన్లకు టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంప్రదాయ చిత్రలేఖనం, ఆలయ నిర్మాణం, శిలాశిల్పం, సిమెంటుతో చేసే సుధాశిల్పం, దారు(కొయ్య) శిల్పం, లోహశిల్పంలో నాలుగేళ్ల డిప్లొమా కోర్సుకు పదో తరగతి పాసైన వారు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 0877- 2264637 నంబరులో సంప్రదించాలని టీటీడీ తెలిపింది.