లాటరీ పద్ధతిలో గురుకులాల్లో అడ్మిషన్లు

ABN , First Publish Date - 2020-06-18T12:35:50+05:30 IST

లాటరీ పద్ధతిలో గురుకులాల్లో అడ్మిషన్లు

లాటరీ పద్ధతిలో గురుకులాల్లో అడ్మిషన్లు

అమరావతి(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(ఏపీఆర్‌ఇఐఎస్‌) కింద నిర్వహిస్తోన్న 50 గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల విధానం మారింది. గతేడాది వరకు అమల్లో ఉన్న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను ఉపసంహరించిన అధికారులు.. 2020-21 విద్యా సంవత్సరపు 5వ తరగతి అడ్మిషన్లకు లాటరీ పద్ధతిని అమలు చేయనున్నారు. అలాగే 6-7 తరగతుల బ్యాక్‌లాగ్‌ అడ్మిషన్లకు లాటరీ పద్ధతినే అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్లు ఆయా తరగతుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాస్థాయిలో ఎంపిక కమిటీ(డీఎస్సీ)లను ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2020-06-18T12:35:50+05:30 IST