టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వాదం..

ABN , First Publish Date - 2020-10-31T17:59:46+05:30 IST

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వివాదానికి దిగారు.

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వాదం..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వివాదానికి దిగారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ధర్మారెడ్డి కనిపించగానే భక్తులు ఆయనను అడ్డుకున్నారు. కాగా.. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి టోకెన్లు జారీ చేయాలని ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ధర్మారెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉచిత దర్శనం టోకెన్లను కొనసాగించడం కష్టమవుతోందని తెలిపారు. ఈవో, చైర్మన్‌లతో మాట్లాడి టోకెన్ల జారీ నిలుపుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. Read more