అదనపు అడ్వకేట్‌ జనరల్‌గాజాస్తి నాగభూషణ్‌

ABN , First Publish Date - 2020-12-10T08:09:41+05:30 IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కుమారుడు జాస్తి నాగభూషణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ)

అదనపు అడ్వకేట్‌ జనరల్‌గాజాస్తి నాగభూషణ్‌

జస్టిస్‌ చలమేశ్వర్‌ కుమారుడి నియామకం

కొన్నాళ్లుగా సీఎంతో సాన్నిహిత్యం

 అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కుమారుడు జాస్తి నాగభూషణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ)గా నియమించింది.  హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న నాగభూషణ్‌... కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన వివిధ ఆరోపణలపై జగన్‌ ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి పలు నివేదికలు కూడా సమర్పించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లినవారిలో జాస్తి నాగభూషణ్‌ కూడా ఉన్నారు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమారుడు కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ నాగభూషణ్‌ను అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మరో అదనపు అడ్వకేట్‌ జనరల్‌ను నియమించడం విశేషం.


Updated Date - 2020-12-10T08:09:41+05:30 IST