నీటి ఎద్దడి లేకుండా చర్యలు: బొత్స

ABN , First Publish Date - 2020-05-13T09:37:47+05:30 IST

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

నీటి ఎద్దడి లేకుండా చర్యలు: బొత్స

విశాఖపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆ శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. జీవీఎంసీ నుంచి రాష్ట్రంలోని మునిసిపల్‌ కమిషనర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాడు-నేడు కింద పాఠశాలల్లో అభివృద్ధి పనులకు అంచనాలను రూపొందించాలని సూచించారు.

Read more