రైతు సమస్యలపై పోరాడుతాం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-12-05T20:56:05+05:30 IST

రైతు సమస్యలపై టీడీపీ పోరాడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రైతు సమస్యలపై పోరాడుతాం: అచ్చెన్నాయుడు

అమరావతి: రైతు సమస్యలపై టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం  టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంధ్రనాథ్, ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై.కేశవరావు, ఏపీ కిసాన్ సభ కార్యదర్శి డి.హరినాథ్  అచ్చెన్నాయుడిని కలిశారు.  ఈ సందర్భంగా వైసీపీ  ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేఖ విధానాలాపై టీడీపీ పోరాడినందుకు రైతు సంఘ నాయకులు అభినందించారు.  రైతులు తరపున పోరాడేందుకు టీడీపీ ముందుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 


ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై చర్చించారు.  వ్యవసాయం ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌‌లో రైతులను  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ  నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు

Updated Date - 2020-12-05T20:56:05+05:30 IST