శ్రీవారి సేవలో అచ్చెన్న
ABN , First Publish Date - 2020-09-03T08:15:44+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరుని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు.

తిరుమల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి, బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో ఆలయంలోకి వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
నిలదీస్తూనే ఉంటా!: అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు2 (ఆంధ్రజ్యోతి): ‘సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా!’ అని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘ఈఎ్‌సఐలో అక్రమాల పేరుతో నన్ను అక్రమకేసులో ఇరికించారని ప్రతి ఒక్కరూ గుర్తించారు. నా అరె్‌స్టను ఖండించారు. అనారోగ్యంతో ఉంటే నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు’ అని ఆయన పేర్కొన్నారు.