పెన్షన్‌కు కరెంట్ బిల్‌కు లింకు ఏంటి?: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-03-02T18:54:42+05:30 IST

అమరావతి: ఒక్కరోజులో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు చేశారు.

పెన్షన్‌కు కరెంట్ బిల్‌కు లింకు ఏంటి?: అచ్చెన్నాయుడు

అమరావతి: ఒక్కరోజులో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు చేశారు. పెన్షన్‌కు కరెంట్ బిల్‌కు లింకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ వెయ్యి రూపాయలున్న పెన్షన్‌ను రూ. 2,250 చేసినట్లు అసత్య ప్రచారం చేసుకుంటారా!? అని మండిపడ్డారు. చంద్రబాబు హయా్ంలో రూ. 2వేలు ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలీదా? అని అన్నారు. ఒక్క రోజులో పెన్షన్ అని హడావుడి ఎందుకని, ఇంత ఆర్భాటం అవసరమా? అని ప్రశ్నించారు. పెన్షన్లు నాలుగు రోజులు లేట్ అయితే ఏమవుతుందన్నారు. పెన్షన్‌ల పంపిణీకి రూ. 1600 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.


Updated Date - 2020-03-02T18:54:42+05:30 IST