-
-
Home » Andhra Pradesh » According to the Supreme Court Decision on pagan shops Evo KS Rama Rao
-
శ్రీశైలంపై ఈవో రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-27T15:14:47+05:30 IST
శ్రీశైలం ఆలయంపై తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ..

కర్నూలు: శ్రీశైలం ఆలయంపై తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా శిల్పా చక్రపాణిరెడ్డిల సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చక్రపాణిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని.. లేకపోతే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు.
అయితే రాజాసింగ్, చక్రపాణిరెడ్డి వ్యాఖ్యలపై శ్రీశైలం ఈవో కేఎస్ రామారావు స్పందించారు. శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు గతంలో షాపులు కేటాయించిన మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే.. అన్యమతస్తుల షాపులు తొలగించేందుకు నోటీసులు కూడా ఇచ్చామని రామారావు వెల్లడించారు. అన్యమతస్తుల షాపుల విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉందని, కోర్టు తీర్పును బట్టే షాపులపై నిర్ణయం తీసుకుంటామని ఈఓ కేఎస్ రామారావు ప్రకటించారు. అయితే, తాను వచ్చాక శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు ఎవరికి షాపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఈఓ కేఎస్ రామారావు పేర్కొన్నారు.