అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు..
ABN , First Publish Date - 2020-02-08T15:46:20+05:30 IST
అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు..

రాజమండ్రి: ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కారు వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం రాజమహేంద్రవరం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లొల్ల లాకుల వద్దకు రాగానే కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. అక్కడే ఉన్న ఇరిగేషన్ సిబ్బంది వెంటనే స్పందించి నలుగురినీ రక్షించారు.