చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం

ABN , First Publish Date - 2020-09-06T07:09:21+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్‌కి శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంద్రబాబుతోపాటు ఆయన

చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం

ఆవును తప్పించబోయి..

డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌

జామర్‌ కారును ఢీకొట్టిన 

ఎస్కార్ట్‌ వాహనం

చంద్రబాబు, భద్రతా సిబ్బంది క్షేమం 

దండుమల్కాపూర్‌ సమీపంలో ఘటన

 

చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 5: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్‌కి శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంద్రబాబుతోపాటు ఆయన భద్రతా సిబ్బంది ఎవరూ గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ సమీపంలోకి రాగానే కాన్వాయ్‌లోని మొదటి వాహనానికి అకస్మాత్తుగా ఒక ఆవు అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్‌ దానిని తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేశాడు.
వెనుక వస్తున్న జామర్‌ వాహనం డ్రైవర్‌ కూడా సడన్‌ బ్రేక్‌ వేయడంతో దానిని గమనించని మరో ఎస్కార్ట్‌ వాహనం.. జామర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎస్కార్ట్‌ వాహనం ముందుభాగం కొంత దెబ్బతిన్నది. ఎస్కార్ట్‌ వాహనం వెనుక చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం ఉంది. ఆ కారు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో సడన్‌ బ్రేక్‌ వేయడంతో ప్రమాదం తప్పింది. చంద్రబాబు సురక్షితంగా బయటపడ్డారు.


తన వాహనం లోనుంచే ప్రమాదానికి గురైన కారును ఆయన పరిశీలించారు. భద్రతా సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో దెబ్బతిన్న కారును పక్కన పెట్టి, ఎస్కార్ట్‌గా ఉన్న భద్రతా సిబ్బందిని వేరే కారులో ఎక్కించి హైదరాబాద్‌కు బయలుదేరారు. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు సందర్శించారు.


Updated Date - 2020-09-06T07:09:21+05:30 IST