చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-05-09T21:01:08+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుండ్లగుట్టపల్లి వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా, ఒకరికి గాయాలు అయ్యాయి. మృతులు వేలు(27), మణిబాలన్(25), వేణుగోపాల్(60)గా పోలీసులు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుండ్లగుట్టపల్లి వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా, ఒకరికి గాయాలు అయ్యాయి. మృతులు వేలు(27), మణిబాలన్(25), వేణుగోపాల్(60)గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చెన్నైకి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణలోని మల్లన్నసాగర్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదానికి గురైన కారులో తమిళనాడు నుంచి తెలంగాణ వెళ్లేందుకు అనుమతి పొందిన పత్రాలు లభించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-09T21:01:08+05:30 IST