రెండు బైక్‌లు ఢీ..ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-08-23T14:19:01+05:30 IST
రెండు బైక్‌లు ఢీ..ఇద్దరు మృతి
నెల్లూరు: జిల్లాలో జలదంకి మండలం బ్రహ్మణక్రాక దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.