ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి

ABN , First Publish Date - 2020-06-24T01:33:09+05:30 IST

కదిరి నియోజకవర్గం పరిధిలోని నంబులపూలకుంట తహసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారిని రెడ్

ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి

అనంతపురం: కదిరి నియోజకవర్గం పరిధిలోని నంబులపూలకుంట తహసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకెళితే.. నంబులపూలకుంట తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి.. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రైతు కొండారెడ్డి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధిత రైలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కాప్లాన్ ప్రకారం.. రైతు కొండారెడ్డి నుంచి సదరు రెవెన్యూ అధికారి రూ.1500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కార్యాలయంలో వెళ్లారు. అయితే ఏసీబీ అధికారుల రాకను గమనించిన రెవెన్యూ అధికారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో ఆ అధికారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2020-06-24T01:33:09+05:30 IST