ఏసీబీ కస్టడీలో అచ్చెన్న.. రెండు గంటలుగా విచారణ
ABN , First Publish Date - 2020-06-26T00:27:30+05:30 IST
మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు గంటలుగా...

గుంటూరు: మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు గంటలుగా ఆస్పత్రిలోనే అచ్చెన్నను ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు ఏసీబీ అధికారులు.. జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌ను కలిశారు. అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుంటున్నామని వివరించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
కాగా ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ప్రస్తుతం పడకపై ఏస్థితిలో ఉన్నారో అదే స్థితిలో ప్రశ్నించాలని, న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాలని సూచించారు.