అనంతపురం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ABN , First Publish Date - 2020-06-24T00:21:50+05:30 IST

అనంతపురం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

అనంతపురం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

అనంతపురం: కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రైతు కొండారెడ్డి నుంచి రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై ఏసీబీ అధికారులను రైతు కొండారెడ్డి ఆశ్రయించారు. రైతు నుంచి రెవెన్యూ అధికారి రూ.1500 లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఏసీబీ అధికారుల రాకను చూసి రెవెన్యూ అధికారి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారిని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more