ఏబీఎన్ ఎఫెక్ట్ : ‘ఏపీ సీఎం జగన్’ నంబర్ ప్లేట్ ఔట్
ABN , First Publish Date - 2020-05-31T19:05:56+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కారుకు నంబర్ కాకుండా..
రాజమండ్రి/అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కారుకు నంబర్ కాకుండా.. దాని స్థానంలో ‘ఏపీ సీఎం జగన్’ అని రాసుకున్న వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ వార్తా పత్రిలో కథనం వచ్చింది. నిబంధనలు అతిక్రమించిన దీనిపై అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. ఏబీఎన్ ఎఫెక్ట్‌తో ఎట్టకేలకు ‘ఏపీ సీఎం జగన్’ పేరును తీసేసిన ఎమ్మెల్యే నంబర్ ప్లేట్‌ను (DL 3CBZ 0932) అమర్చుకున్నారు. కాగా చిట్టిబాబు ఈ మధ్య వివాదాస్పదమైన నిర్ణయాలతో తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.