ప్రాంగణ ఎంపికల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ విద్యార్థుల సత్తా
ABN , First Publish Date - 2020-12-30T08:31:48+05:30 IST
ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ విద్యార్థులు సత్తాచాటారని కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, రాయపాటి గోపాలకృష్ణ వెల్లడించారు. మంగళవారం విద్యార్థులకు కళాశాలలో నియామక పత్రాలు అందజేశారు.

గుంటూరు(విద్య), డిసెంబరు 29 : ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ విద్యార్థులు సత్తాచాటారని కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, రాయపాటి గోపాలకృష్ణ వెల్లడించారు. మంగళవారం విద్యార్థులకు కళాశాలలో నియామక పత్రాలు అందజేశారు. ఈ విద్యాసంవత్సరం టిసీఎ్‌సలో 200 మంది, సీటీఎ్‌సలో 124 మంది, ఇన్ఫోసి్‌సలో 44 మంది, మరో ఇతర 17 కంపెనీల్లో 54 మంది మొత్తం 419 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వీరిలో కోవీఎం బెంగళూరు కంపెనీ రూ. 7.5లక్షలు, టీసీఎస్ రూ. 7లక్షలు, ఇన్ఫోసిస్ రూ. 5లక్షలు వార్షిక వేతనం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులను ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి సుధాకర్, ప్లేస్‌మెంట్స్ డీన్ డాక్టర్ జిఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.