అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: లోకేశ్

ABN , First Publish Date - 2020-08-12T18:10:41+05:30 IST

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు.

అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: లోకేశ్

అమరావతి: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మాటలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. "కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తిసామర్ధ్యాలను బయటకు తీసి నువ్వెంటో నిరూపించుకునేందుకు వచ్చాయి. ఆ కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని" అంటూ కలాం ఇచ్చిన స్ఫూర్తి ఇప్పుడు యువతకి మార్గనిర్దేశమని ట్వీట్ చేశారు. కాలం మారుతోందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలు, నైపుణ్యాభివృద్ధి నేటి యువత విజయానికి మార్గమన్నారు. అందుకే, సవాళ్ళను స్వీకరించి, గెలుపుకు ముందడుగెయ్యాలని ట్వీట్ చేశారు.  Updated Date - 2020-08-12T18:10:41+05:30 IST