-
-
Home » Andhra Pradesh » Aana perti
-
ఆన.. పర్తి..
ABN , First Publish Date - 2020-12-28T09:22:07+05:30 IST
చెవిలో కోర్కెలు చెబితే చాలు నెరవేర్చేసే స్వామిగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీగణపతి పేరొందాడు.

చెవిలో కోర్కెలు చెబితే చాలు నెరవేర్చేసే స్వామిగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీగణపతి పేరొందాడు. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలతో సవాళ్లు విసురుకుని ఈనెల 23న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ స్వామి వద్ద సత్యప్రమాణాలు చేశారు. వాస్తవానికి బిక్కవోలు గణపతి తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఏకశిలా విగ్రహమని పురావస్తుశాఖ పరిశీలనలో వెల్లడైంది. ఆ కాలంలో బిక్కవోలును రాజధానిగా చేసుకుని తూర్పుచాళుక్యులు పరిపాలించారు. వారు యుద్ధాలకు వెళ్లే ముందు స్వామిని దర్శించి వెళ్లి విజయాలు పొందేవారట. ఇక్కడ వినాయకుని తొండం కుడివైపునకు ఉండడంతో స్వామి చెవిలో కోర్కెలు చెబితే తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల భక్తులందరూ స్వామి చెంతకు వెళ్లి కోర్కెలు చెప్పుకొంటూ ఉంటారు. స్వామికి వేసిన దండలపై చెయ్యి ఆన్చి సత్తి సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీగణపతి తొండంపై చెయ్యి పెట్టి రామకృష్ణారెడ్డి ప్రమాణం తీసుకొన్నారు.