ఏటీఎంలో లాలాజలం ఊసిన యువకుడు
ABN , First Publish Date - 2020-04-05T15:48:32+05:30 IST
ఏటీఎంలో లాలాజలం ఊసిన యువకుడు

కడప/మైదుకూరు: ఓ యువ కుడు ఏటీఎం డిస్ప్లేపై లాలాజలం ఊస్తూ వికృతచేష్ఠలు చేయడం మైదుకూరులో ఆందోళన కలిగించింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు రాయల్ సర్కిల్లోని ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్ల్లి లాలాజలాన్ని డిస్ప్లేపై పూయడం, ఉమ్మడంతో గమనించిన కొందరు అక్కడే ఉన్న పొలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి, స్థానిక వైద్యు లతో పరీక్షించగా 101 డిగ్రీల జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లు గుర్తించడంతో ఆ యువకున్ని కడప రిమ్స్‌కు తరలిం చారు. దీంతో ఏటీఎం సెంటర్‌ను మూసి ఉంచారు.