గుంటూరులో అత్తారింటి వద్ద ఓ మహిళ దీక్ష

ABN , First Publish Date - 2020-06-23T20:59:30+05:30 IST

నగరంలో ఓ మహిళ అత్తారింటివద్ద దీక్షకు దిగింది.

గుంటూరులో అత్తారింటి వద్ద ఓ మహిళ దీక్ష

గుంటూరు: నగరంలో ఓ మహిళ అత్తారింటివద్ద దీక్షకు దిగింది. ఇద్దరు చిన్న పిల్లలతో 10 రోజులుగా అత్తారింటిముందే పడిగాపులు పడుతోంది. భర్త చనిపోయిన తర్వాత అత్తా, మామ ఆమెను ఇంట్లోకి రానివ్వడం లేదు. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. కోడలు ఇంటికి రావడంతో ఆమెను బయటపెట్టి అత్త ఇంటికి తాళం వేసి తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పది రోజులుగా ఇంటి ముందే కూర్చొని నిరసన తెలుపుతోంది. స్పందన, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయింది. స్థానికులు పెట్టిన భోజనం తింటూ.. పక్కనే ఉన్న దేవాలయంలో తలదాచుకుంటోంది. తనకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటోంది. 

Read more