నేటి నుంచి శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-04-24T11:57:54+05:30 IST

నేటి నుంచి శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్

నేటి నుంచి శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్

శ్రీకాళహస్తి: కరోనా విజృంభణతో చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి కకావికలం అవుతోంది. 80వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ప్రకటించారు. పాలు, మందులు, నిత్యావసరాలు ఇంటి వద్దకే వలంటీర్లతో అందించనున్నారు. పట్టణం నుంచి ఉద్యోగుల రాకపోకలను నిషేధించారు. ఉదయం 6నుంచి 9గంటల వరకు బయటకు వచ్చే వెసులుబాటును పూర్తిగా రద్దు చేశారు. పెట్రోల్‌ బంకులను కూడా మూసేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నారు. గురువారం రాత్రి పట్టణంలో పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి, మైక్‌ అనౌన్స్‌మెంట్‌ ద్వారా ప్రజలకు సంపూర్ణ లాక్‌డౌన్‌కు సంబంధించిన హెచ్చరికలు చేశారు. 

Updated Date - 2020-04-24T11:57:54+05:30 IST