ఏపీలో తగ్గుముఖం పట్టని కరోనా.. ఇవాళ కూడా కొత్తగా..
ABN , First Publish Date - 2020-08-01T23:21:02+05:30 IST
ఏపీలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత మూడు రోజుల నుంచి...

ఏపీలో కొత్తగా 9,2,76 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత మూడు రోజుల నుంచి రోజుకు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఏపీలో ఇవాళ కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 9,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ప్రభుత్వం మీడియా బులెటెన్‌లో వెల్లడించింది. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,209కి చేరింది.
ఏపీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1234 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు తర్వాత విశాఖ జిల్లాలో 1155 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో 1128 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 1001, చిత్తూరు 949, తూర్పుగోదావరి 876, నెల్లూరు 559, కడప 547, పశ్చిమగోదావరి 494, శ్రీకాకుళం 455, విజయనగరం జిల్లాలో 119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇవాళ కరోనా వల్ల 59 మంది మృతి చెందారు. దీంతో.. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1,407కి చేరింది. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 72,188 కాగా.. ఇప్పటివరకూ 76,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు.