90 ఏళ్ల బామ్మ.. కరోనాను జయించెన్‌

ABN , First Publish Date - 2020-07-27T08:22:35+05:30 IST

ఆమె వయస్సు 90 సంవత్సరాలు.. ఈ వయసులో ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే కోలుకోవడమే కష్టం.

90 ఏళ్ల బామ్మ.. కరోనాను జయించెన్‌

నెల్లిమర్ల/గుమ్మలక్ష్మీపురం, జూలై 26: ఆమె వయస్సు 90 సంవత్సరాలు.. ఈ వయసులో ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే కోలుకోవడమే కష్టం. కానీ.. ఈ వృద్ధురాలు ప్రాణాంతక కరోనానే జయించారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కొనిస సావిత్రమ్మ (90) కరోనా లక్షణాలతో ఈ నెల 17న జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి మిమ్స్‌లో చేరారు. ఏ మాత్రం అధైర్య పడకుండా తొమ్మిది రోజులపాటు చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. చికిత్సలో భాగంగా నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్‌ రావడంతో ఆదివారం ఆమెను డిశ్చార్జ్‌ చేశారు. 

Updated Date - 2020-07-27T08:22:35+05:30 IST