ఏపీలో స్థానిక సంస్థలకు 656 కోట్లు
ABN , First Publish Date - 2020-06-18T08:24:34+05:30 IST
ఏపీలో స్థానిక సంస్థలకు 656 కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఏపీలో స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.656 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు నిధులు విడుదల చేసినట్టు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.