655 మంది రిలీవ్‌ దారుణం

ABN , First Publish Date - 2020-03-19T09:41:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 655మంది విద్యుత్‌ ఉద్యోగులను ఈ నెల 14వ తేదీన అదీ సెలవు రోజున అర్ధాంతరంగా తెలంగాణా రాష్ట్ర సంస్థలకు రిలీవ్‌ చేయడాన్ని రిలీవ్‌డ్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌...

655 మంది రిలీవ్‌ దారుణం

గుణదల, మార్చి 18: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 655మంది విద్యుత్‌ ఉద్యోగులను ఈ నెల 14వ తేదీన అదీ సెలవు రోజున అర్ధాంతరంగా తెలంగాణా రాష్ట్ర సంస్థలకు రిలీవ్‌ చేయడాన్ని రిలీవ్‌డ్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి ప్రధాన కార్యదర్శి కొలకాని వీవీఎస్‌ మూర్తి తీవ్రంగా ఖండించారు. గుణదలలోని విద్యుత్‌ కార్మికుల భవన్‌లో జేఏసీ అత్యవసర సమావేశం బుధవారం జరిగింది. సంస్ధ ఉద్యోగులను ఉద్దేశించి మూర్తి మాట్లాడుతూ.. జస్టిస్‌ ధర్మాదికారి కమిటీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉద్యోగులను తెలంగాణాకు కేటాయిస్తూ రిలీవ్‌ చేయడాన్ని తప్పుబట్టారు.

Updated Date - 2020-03-19T09:41:12+05:30 IST