ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్‌ కేసులు.. 41 మరణాలు

ABN , First Publish Date - 2020-10-04T00:11:50+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటలంలో ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల

ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్‌ కేసులు.. 41 మరణాలు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటలంలో ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7 లక్షల 13014కు చేరింది. ఈ రోజు కరోనాతో 41 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన మరణాలతో కలిపి రాష్ట్రంలో 5,941 కరోనా మృతుల సంఖ్యం పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 55,282 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,51,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. 


కృష్ణా 6, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు 3, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో 890, చిత్తూరు 827, తూర్పుగోదావరి జిల్లాలో 824, ప్రకాశం జిల్లాలో 619 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 60.21 లక్షల కరోనా టెస్ట్‌లు చేశారు.

Updated Date - 2020-10-04T00:11:50+05:30 IST