60శాతం అదుపులోకి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-05-09T08:43:04+05:30 IST
విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్ విష వాయువును 60శాతం అదుపులోకి తెచ్చామని, ఇంకో 24 గంటల్లో ..
విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్ విష వాయువును 60శాతం అదుపులోకి తెచ్చామని, ఇంకో 24 గంటల్లో పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని సీఎం జగన్‌కు కలెక్టర్ వినయ్‌చంద్ శుక్రవారం నివేదిక పంపించారు. పొలమరైజేషన్ ప్రక్రియ ద్వారా విషవాయువులు రాకుండా సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.