ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-17T22:14:57+05:30 IST

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్త

ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 534 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,77,348కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,069 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,454 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,65,825 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 

Updated Date - 2020-12-17T22:14:57+05:30 IST