ఏపీలో కొత్తగా 5,120 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-07T23:21:23+05:30 IST

ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్లినట్లు గణాంకాల ద్వారా అర్థమవుతోంది.

ఏపీలో కొత్తగా 5,120 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్లినట్లు గణాంకాల ద్వారా అర్థమవుతోంది. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 7,34,427కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 34 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 6,086 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 49,513 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,78,826 మంది రికవరీ అయ్యారు. 

Read more