ఏపీలో 500 కరోనా కేసులు, ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2020-12-15T23:46:28+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏపీలో ..

ఏపీలో 500 కరోనా కేసులు, ఐదుగురు మృతి

విజయవాడ:  రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,76,336 కరోనా కేసులు చేరాయి.  ఇప్పటివరకు కరోనాతో 7,064 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో4,660 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి 8,64,612 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఈరోజు కరోనాతో కృష్ణాజిల్లాలో కరోనాతో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శానిటైజర్, మాస్కులు విధిగా వాడాలని డాక్టర్లు తెలిపారు. 

Read more