ఎల్జీ బాధితులకు రూ.50 వేలు!
ABN , First Publish Date - 2020-06-16T10:10:28+05:30 IST
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యక్తిగతంగా లేఖలు ..

టీడీపీ సహాయం... చంద్రబాబు లేఖ
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఈ లేఖలను విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ప్రతి కుటుంబాన్ని కలిసి వ్యక్తిగతంగా అందజేశారు. ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు స్వాంతనగా టీడీపీ తరఫున రూ.50 వేలు చొప్పున అందజేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 15 మంది మృతి చెందడం తన మనసును కలచివేసిందని తెలిపారు. వ్యక్తిగతంగా పరామర్శించి, ఆర్థిక సాయం అందించాలనుకుంటే వైసీపీ ప్రభుత్వం సహకరించలేదని వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నామని తెలిపారు.