హోం క్వారంటైన్‌పై ‘యాప్‌’ నిఘా: డీజీపీ

ABN , First Publish Date - 2020-04-26T09:47:12+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలను గట్టిగా అమలు చేస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విధి నిర్వహణలో కరోనా బారిన పడి ..

హోం క్వారంటైన్‌పై ‘యాప్‌’ నిఘా: డీజీపీ

  • ఏఎ‌స్‌ఐ కుటుంబానికి  50 లక్షలు అందజేత

అనంతపురం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలను గట్టిగా అమలు చేస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విధి నిర్వహణలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన అనంతపురం జిల్లా పరిగికి చెందిన ఏఎ్‌సఐ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం జిల్లాకు వచ్చిన డీజీపీ మీడియాతో మాట్లాడారు. 28 వేల మంది విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారని, వారిలో 22,266 మందిని గుర్తించామన్నారు. వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి, యాప్‌ ద్వారా నిఘా పెట్టినట్టు చెప్పారు. దీనికి ముందు ఆయన ఏఎస్‌ కు టుంబాన్ని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరామర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఏఎ్‌సఐ సోదరుడికి అందించారు. 

Updated Date - 2020-04-26T09:47:12+05:30 IST